హిండెన్‌బర్గ్ కేసులో అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చీట్ ఇచ్చింది. హిండెన్ బర్గ్ నివేదిక నిరాధారమని సెబీ పేర్కొంది. సెబీ క్లీన్ చీట్ ఇవ్వడంపై అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. తప్పుడు నివేదిక వల్ల మదుపరులు నష్టపోయారని అదానీ ఆవేదన వ్యక్తం చేశారు. అవాస్తవాలు వ్యాప్తి చేసిన వారు దేశానికి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.