హిట్ అండ్ రన్.. మూడేళ్ల బాలుడి మృతి (వీడియో)

15717చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ఐఎస్‌ సదన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శనివారం రాత్రి హిట్‌ అండ్‌ రన్‌ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఐఎస్‌ సదన్‌ ఎక్స్‌ రోడ్‌ వద్దకు వచ్చిన మూడేళ్ల ఇజాన్‌ ఉద్దీన్‌ రోడ్డు దాటుతుండగా XUV కారు ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్‌ ఆపకుండా వెళ్లిపోయాడు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్