'హిట్​ అండ్​ రన్' బాధితులకు రూ.2 లక్షల వరకు సాయం.. ఇలా పొందండి!

1చూసినవారు
'హిట్​ అండ్​ రన్' బాధితులకు రూ.2 లక్షల వరకు సాయం.. ఇలా పొందండి!
రోడ్డు ప్రమాద ఘటనల్లో గాయపడినా లేదా మరణించినా కేంద్ర ప్రభుత్వం హిట్​ అండ్​ రన్​ మోటార్​ యాక్సిడెంట్స్​ పథకం కింద పరిహారం చెల్లిస్తోంది. మరణిస్తే రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందిస్తోంది. ఫారం-1లో బాధితుడి వ్యక్తిగత వివరాలు, ప్రమాదం జరిగిన ప్రాంతం, తీరు, సమయం, గాయాల తీవ్రత, ఎఫ్​ఐఆర్​ పత్రం, బ్యాంకు ఖాతా, ఆధార్​ జిరాక్స్ జత చేసి జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. గాయపడిన వారు ఫారం-4 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాలు కలెక్టరేట్‌లో ఉచితంగా లభిస్తాయి. విచారణ అనంతరం సంబంధికుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ అవుతుంది.

సంబంధిత పోస్ట్