ఎనిమిదేళ్ల తర్వాత హాకీ ఆసియా కప్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్‌లో 4-1 తేడాతో సౌత్ కొరియాను మట్టి కరిపించింది. వరుస విరామాల్లో టీమిండియా గోల్స్ సాధించి ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించింది. రెండు గోల్స్‌తో దిల్‌ప్రీత్ సింగ్ అదరగొట్టాడు. దీంతో హాకీ ప్రపంచ కప్ 2026కు భారత్ అర్హత సాధించింది.