TG: రైతన్నలు కాళ్ళు పట్టుడు బంద్ చేసి, కాంగ్రెస్ వాళ్ల కాలర్ పట్టుకొని నిలదీయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వరంగల్ రైతు సదస్సులో మాట్లాడుతూ.. 'దండం పెట్టడం కాదు కాంగ్రెస్ పార్టీకి పిండం పెట్టండి. అట్లైతేనే రైతులకు మంచి రోజులు వస్తాయి. తాలు తీస్తే రైతులు నీ తోలు తీస్తారు. మక్కలు కొనకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి ముక్కలు అవుతుంది' అని హెచ్చరించారు.