GTతో జరగుతున్న మ్యాచులో RCB కెప్టెన్ రజత్ పాటీదార్ ఔటైన తీరు చర్చనీయాంశం అవుతోంది. అర్షద్ ఖాన్ బౌలింగులో పాటీదార్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే హోల్డర్ పరిగెత్తుకుంటూ వచ్చి బౌండరీ లైన్‌కు దగ్గరలో క్యాచ్ పట్టాడు. ఈ క్రమంలో హోల్డర్ కంట్రోల్ తప్పడంతో బాల్ గ్రౌండ్‌కు తాకింది. కానీ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో కోహ్లీ సహా ఆర్సీబీ ప్లేయర్లు, కోచ్ అసహనం వ్యక్తం చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.