హోలీ సందర్భంగా కెమికల్ రంగులకు బదులుగా సహజ రంగులు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చని చెప్తున్నారు. పసుపు రంగు: శనగపిండి, పసుపు పొడిని రెండు భాగాల పసుపు, ఒక భాగం పిండిగా కలిపితే పొడి సిద్ధం. బంతి, చామంతులను ఎండబెట్టి పొడి చేసినా సరిపోతుంది. ఎరుపు రంగు: ఎర్ర మందార పువ్వులు ఎండబెట్టి పొడి చేయాలి. కుంకుమపువ్వు, శనగపిండి కలిపితే మంచి రంగు వస్తుంది. ముదురు గులాబీ: బీట్‌రూట్ ముక్కలను రాత్రంతా నానబెట్టి మరిగిస్తే రంగు నీరు సిద్ధం. ఆకుపచ్చ: బియ్యం పిండిలో గోరింటాకు పొడి కలిపితే పొడి తయారు. గోధుమ రంగు: కాఫీ పొడిని నీటిలో మరిగిస్తే సహజ గోధుమ రంగు రెడీ.