TG: రాష్ట్రంలోని పాఠశాలల్లో జూన్ 15న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. ఆ రోజు అమావాస్య కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపడానికి విముఖత చూపుతున్నారు. దీంతో పలు పాఠశాలలు సెలవులను మరో రెండు రోజులు పొడిగిస్తూ తల్లిదండ్రులకు సందేశాలు పంపుతున్నాయి. అయితే మిగిలిన పాఠశాలలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే జూన్ 15న పునఃప్రారంభం కానున్నాయి.