అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటుడు పీటర్ గ్రీన్ మృతి

95చూసినవారు
అనుమానాస్పద స్థితిలో హాలీవుడ్ నటుడు పీటర్ గ్రీన్ మృతి
ప్రముఖ హాలీవుడ్ నటుడు పీటర్ గ్రీన్ (60) న్యూయార్క్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన మేనేజర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు అపార్ట్‌మెంట్‌లో ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు జరగలేదని తెలిపారు. పీటర్ గ్రీన్ 'పల్ప్ ఫిక్షన్', 'ది మాస్క్' వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్