ప్రముఖ హాలీవుడ్ నటి సాలీ కిర్క్‌ల్యాండ్ (84) కన్నుమూశారు. డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె, పలుమార్లు కిందపడటం మరియు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల కారణంగా చికిత్స పొందుతూ మరణించారు. 1968లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సాలీ, 200కు పైగా చిత్రాలు, టెలివిజన్ సిరీస్‌లలో నటించారు. ముఖ్యంగా, 1987లో వచ్చిన 'అన్నా' చిత్రంలో నటనకు గాను ఆమె ఉత్తమ నటిగా ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. అలాగే, గోల్డెన్ గ్లోబ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించారు.