TG: హఫీజ్‌పేట్‌లో మహిళపై దాడి చేసిన హోంగార్డ్ ఆనంద్‌ను సర్వీస్ నుంచి తొలగిస్తూ వికారాబాద్ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళను కొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటనలో ఆనంద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతను రైల్వే పోలీస్ ఫోర్స్‌లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.