TG: ఖమ్మం జిల్లా సీసీఎస్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్న ఏనుగుల మంజుల (47) గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణం ఎందరో అభాగ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. మంజుల 'అమ్మ అనాథ శరణాలయం' ఏర్పాటు చేసి ఎందరో పిల్లల ఆకలి తీర్చారు. గురువారం సాయంత్రం డ్యూటీ ముగించుకుని ఆశ్రమానికి వచ్చిన మంజుల హాల్లోనే నిద్రపోయారు. శుక్రవారం ఉదయం 'అమ్మా.. గుడ్ మార్నింగ్.. లే అమ్మా' అంటూ పిల్లలు ఆమెను పిలిచారు. ఎంత పిలిచినా లేవకపోవడంతో వైద్యుడిని తీసుకొచ్చారు. గుండెపోటుతో ఆమె చనిపోయారని వైద్యులు తెలిపారు.