దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ఏప్రిల్-జూన్ మధ్య ఇళ్ల అమ్మకాలు.. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 6% తగ్గి 91,729 యూనిట్లకు చేరుకున్నాయి. మార్కెట్ అనిశ్చితి, పశ్చిమ ఆసియా ఘర్షణలు, AI ప్రభావం వంటి అంశాలు కొనుగోలుదారుల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయని ప్రాప్‌టైగర్ రియల్ ఇన్సైట్ రిపోర్ట్ పేర్కొంది. ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, పుణే, కోల్‌కతా, అహ్మదాబాద్‌లలో అమ్మకాలు తగ్గినప్పటికీ, చెన్నైలో 36%, హైదరాబాద్‌లో 15% వృద్ధి నమోదైంది. కొత్త ఇళ్ల సరఫరా మాత్రం 6% పెరిగి 89,161 యూనిట్లకు చేరింది.