భారత్‌లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు

6చూసినవారు
భారత్‌లో భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. నైట్ ఫ్రాంక్ సంస్థ నివేదిక ప్రకారం, 2026 తొలి త్రైమాసికంలో 8 మెట్రో నగరాల్లో రూ.50 లక్షల లోపు ఇళ్ల అమ్మకాలు 23% తగ్గాయి. నిర్మాణ సామాగ్రి ధరలు పెరగడం వల్ల ఇళ్ల ధరలు ఎగబాకడం, హోమ్ లోన్ వడ్డీ రేట్లు అధికంగా ఉండటం ప్రధాన కారణాలుగా పేర్కొన్నారు. అదే సమయంలో ఖరీదైన ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో డెవలపర్లు లగ్జరీ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని ఈ నివేదిక పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్