ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


Jun 17, 2026, 12:06 IST/

సిక్కింలో అరుదైన ‘మిష్మి టాకిన్’ మంద దర్శనం (వీడియో)

Jun 17, 2026, 12:06 IST
సిక్కింలోని బాకుచుంగ్ ప్రాంతంలో అటవీ శాఖ సిబ్బంది అత్యంత అరుదైన, అంతుచిక్కని వన్యప్రాణి ‘మిష్మి టాకిన్’ మందను గుర్తించారు. మేక, ఎద్దు కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి విచిత్ర రూపంతో ఉండే ఈ జీవులు కనిపించడం చాలా అరుదు. తూర్పు హిమాలయాల్లో నివసించే ఈ అతిపెద్ద జంతువు అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. దట్టమైన అడవుల నరికివేత, రోడ్ల నిర్మాణం, పర్యాటకం పెరిగిపోవడం వల్ల వీటి ఆవాసాలు దెబ్బతింటున్నాయి. ఈ అరుదైన జీవుల జనాభాను, అవి ఎక్కడెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకోవడానికి వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా భారీ సర్వేను ప్రారంభించింది.