ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్, స్కూటర్
ఇండియా (HMSI) తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘హోండా QC3’ని భారత మార్కెట్లో రూ. 1.35 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరకు విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.0kWh బ్యాటరీతో 145 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. రూ. 5,000తో బుకింగ్ ప్రారంభమైన ఈ స్కూటర్, 5-అంగుళాల TFT డిస్ప్లే, స్మార్ట్ కీ, 32 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. ఇది 4 ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. మొదటి దశలో ఢిల్లీ, ఆగ్రా, కటక్, సూరత్, కొల్లంలలో అందుబాటులో ఉంటుంది.