ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఆర్జీ కర్‌ కేసులో ముగ్గురు  సీనియర్‌ ఐపీఎస్‌ల సస్పెన్షన్‌
May 16, 2026, 03:05 IST/

ఆర్జీ కర్‌ కేసులో ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ల సస్పెన్షన్‌

May 16, 2026, 03:05 IST
కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు గాను ముగ్గురు ఐపీఎస్‌ అధికారులను బెంగాల్ ప్రభుత్వం శుక్రవారం సస్పెండ్‌ చేసింది. అప్పటి కోల్‌కతా పోలీసు కమిషనర్‌ వినీత్‌ గోయల్‌, డిప్యూటీ కమిషనర్లు ఇందిరా ముఖర్జీ, అభిషేక్‌ గుప్తాలపై ఈ చర్యలు తీసుకున్నారు. కేసు దర్యాప్తులో నిబంధనలు పాటించకపోవడం, బాధితుల తల్లిదండ్రులకు లంచం ఇవ్వజూపడం, అనుమతి లేకుండా విలేకరుల సమావేశం నిర్వహించడం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. వీరిపై శాఖాపరమైన దర్యాప్తుతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని సీఎం సువేందు అధికారి తెలిపారు.