జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, గుండె ఆరోగ్యం, బరువు తగ్గడం, చర్మ కాంతి, మధుమేహ నియంత్రణకు తేనె, వెల్లుల్లి మిశ్రమం అద్భుతమని నిపుణులు చెబుతున్నారు. ఈ రెండింటి కలయిక శరీరానికి వ్యాధులతో పోరాడే శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఖాళీ కడుపుతో తేనె, వెల్లుల్లి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.