పరువు హత్య.. వెలుగులోకి కీలక విషయాలు

2చూసినవారు
పరువు హత్య.. వెలుగులోకి కీలక విషయాలు
AP: తూ.గో. జిల్లా మండపేటలో చోటు చేసుకున్న పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సూర్యప్రకాశ్(41), సంధ్య(40) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. అనంతరం దూరమయ్యారు. సంధ్య తండ్రి మరణించగా.. సూర్యప్రకాశ్ పరామర్శకు వెళ్లాడు. అప్పుడు వీరి మధ్య స్నేహం పెరిగి, ప్రేమగా మారింది. ఇరువురివీ వేర్వేరు కులాలు కావడం, సంధ్య ప్రభుత్వ ఉద్యోగి కావడంతో మంచి సంబంధాలు తెస్తామంటూ సోదరులు అభ్యంతరం చెప్పి వివాహం చేసుకోవద్దని హెచ్చరించారు. అయినా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అమ్మకు ఆరోగ్యం బాగాలేదని బయటకు రప్పించి సంధ్య సోదరులు సూర్యప్రకాశ్‌ను రాళ్లతో కొట్టి చంపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్