ఆనర్ సంస్థ సెప్టెంబర్ 24న మలేషియాలో ‘Honor X9e Pro’ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ 11000mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. 10,000 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన డిస్ప్లే, 108MP ప్రధాన కెమెరా దీని ప్రత్యేకతలు. కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా IP69K రేటింగ్‌తో వస్తున్న ఈ ఫోన్ భారత్‌లో లభ్యతపై త్వరలోనే స్పష్టత రానుంది.