హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో పోలీసుల సమక్షంలోనే కొందరు యువకులు బైక్‌లపై ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ రెచ్చిపోయారు. తమ స్టంట్స్‌ను మొబైల్ ఫోన్లలో చిత్రీకరించుకుంటూ, పోలీసులను సైతం లెక్కచేయని తీరు కనిపించింది. అయితే, అత్తాపూర్ పోలీసులు వెంటనే స్పందించి, స్టంట్స్ చేసిన పోకిరీలను వెంబడించి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.