గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలో ఘోరం జరిగింది. అర్ధరాత్రి బహిర్భూమికి వెళ్లిన 15 ఏళ్ల బాలికను ముగ్గురు యువకులు బైక్‌పై అపహరించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ మరో ఐదుగురు స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నాడు.