TG: హైదరాబాద్ శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్‌పై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగి క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవదహనమయ్యాడు. మంటల తీవ్రతకు అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ సీట్‌బెల్ట్ లాక్ కావడంతో బయటపడలేకపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది.