రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన నెలకొంది. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇన్‌స్టిట్యూషన్స్ టెక్నికల్ క్యాంపస్ హాస్టల్‌లో బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి రాము (20) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రాథమికంగా ఆత్మహత్యగా నిర్ధారించిన పోలీసులు, కారణాలపై లోతుగా విచారణ చేస్తున్నారు.