ఘోర రైలు ప్రమాదం.. కన్నీరు పెట్టిస్తున్న దృశ్యాలు

61562చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్‌లో మంగళవారం ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. గూడ్స్‌ రైలును ప్యాసింజర్‌ రైలు ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని తోటి ప్రయాణికులు చేతులపై మోసుకుని వెళుతున్నారు. గాయపడిన వారు బాధతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సంబంధిత పోస్ట్