తూఫాన్ విధ్వంసానికి కొద్ది క్షణాల ముందు.. భయానక దృశ్యాలు (వీడియో)

3చూసినవారు
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజరలో తూఫాన్‌ బీభత్సం సృష్టించింది. తూఫాన్‌ విరుచుకుపడటానికి కొద్ది క్షణాల ముందు చుట్టూ చీకటి అలుముకుని, భారీగా దుమ్ము, నల్లటి మేఘాలతో భయానక పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందో అర్థంకాని స్థితిలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బలమైన గాలులకు చెట్లు, రేకులు ఎగిరిపడగా.. కొందరు మనుషులు సైతం కొంత దూరం నెట్టబడ్డారు. అదృష్టవశాత్తు బాధితులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్