
బాలసదన్‌లో దారుణం.. బాలుడిపై లైంగిక దాడి
TG: హైదరాబాద్ సైదాబాద్ బాలసదన్‌లో పర్యవేక్షకుడు ఓ బాలుడిపై లైంగిక దాడి చేశాడు. దసరా పండగకి ఇంటికి వచ్చి తిరిగి జువెనైల్ హోంకు వెళ్లనని బాలుడు తల్లి వద్ద బోరున విలపించాడు. ఆరా తీయడంతో విషయం తెలిసింది. అభంశుభం తెలియని బాలురపై అసహజరీతిలో తరచూ లైంగికదాడికి పాల్పడ్డాడు. మొదట బాధితుడు ఒక్కడే అనుకున్నారు కానీ మరో అయిదుగురిపైనా లైంగిక దాడి చేసినట్లు తెలిసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.




