ప్లాస్టిక్ కవర్లు, డబ్బాల్లో వేడి ఆహారం తీసుకోవడం వల్ల మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలోకి చేరి క్యాన్సర్, నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు, కాలేయం వంటి అవయవాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి, అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనాలు కూడా ఈ ప్రమాదాన్ని ధృవీకరించాయి. విజయవాడకు చెందిన మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింధు కిలారు, ప్లాస్టిక్‌లోని బీఏపీ, థాలేట్స్ వంటి రసాయనాలు ఆహారంలో కలిసి క్యాన్సర్‌కు కారణమవుతాయని, పిల్లల పాల సీసాలు, పీవీసీ పైపుల నీరు కూడా హానికరం కావచ్చని తెలిపారు.