TG: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ సోమారంలో వాటర్ హీటర్ పేలడంతో ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. హీటర్ ఆన్ చేసి బయటకు వెళ్లిన సమయంలో మంటలు చెలరేగి క్షణాల్లో ఇల్లంతా వ్యాపించాయి. అదృష్టవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు.