పేదల ఆత్మగౌరవానికి కోటి విలువైన ఇళ్లు: మంత్రి పొంగులేటి

5345చూసినవారు
పేదల ఆత్మగౌరవానికి కోటి విలువైన ఇళ్లు: మంత్రి పొంగులేటి
హైదరాబాద్ రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్‌కు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా కోట్లకు పైగా విలువ చేసే ఇళ్లను ఉచితంగా అందజేస్తున్నామని, లాటరీ పద్ధతిలోనే లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో లక్ష, దసరా నాటికి 2 లక్షల ఇళ్లు పూర్తి చేసి, రాబోయే రెండేళ్లలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పిస్తూ, వారి తీరు మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో సీట్లు సున్నా వస్తాయని జోస్యం చెప్పారు.

సంబంధిత పోస్ట్