సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై హూతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ప్రకటించారు. రియాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ, మంటలు కనిపించాయి. సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ రియాద్ వైపు దూసుకొచ్చిన బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణం తెలిపింది. ఈ దాడితో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హూతీల దాడులను ఐరాస భద్రతా మండలి తీవ్రంగా ఖండించి ఆందోళన వ్యక్తం చేసింది.