ఖమేనీ జాడను ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది?.. వెలుగులోకి కీలక విషయాలు

56చూసినవారు
ఖమేనీ జాడను ఇజ్రాయెల్ ఎలా కనిపెట్టింది?.. వెలుగులోకి కీలక విషయాలు
ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ జాడను ఇజ్రాయెల్ ఎలా గుర్తించిందనే అంశంపై అంతర్జాతీయ మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి. ఫైనాన్షియల్ టైమ్స్‌ నివేదిక ప్రకారం, టెహ్రాన్ నగరంలోని సీసీ కెమెరాలు, ట్రాఫిక్ వ్యవస్థ, మొబైల్ నెట్‌వర్క్‌లను సంవత్సరాలుగా హ్యాక్ చేసి కదలికలను పర్యవేక్షించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న కీలక డేటాను సేకరించి ఖచ్చితమైన సమాచారం ఆధారంగా దాడి ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించింది. లైవ్ కెమెరా ఫీడ్‌లు, భద్రతా సిబ్బంది కదలికలను డిజిటల్ మ్యాప్ చేసి ఆపరేషన్ నిర్వహించినట్లు ఈ కథనం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్