TG: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 23 నెలల పాలనపై 'బూటకపు హామీలు మోసపూరిత వాగ్ధానాలు' పేరుతో బీజేపీ చార్జిషీట్ ను ఇవాళ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ స్టేట్ చీఫ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం నుంచి ఎన్ని కోట్లు కక్కించిందో కాంగ్రెస్ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.