TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు శుక్రవారంతో ముగిసింది. మొత్తం 2,996 వార్డులకు 22,519 మంది అభ్యర్థుల నుంచి 29,742 నామినేషన్లు వచ్చినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పార్టీల వారీగా కాంగ్రెస్- 10,046, బీఆర్ఎస్- 7564, బీజేపీ- 5462, ఎంఐఎం- 576, జనసేన- 342, టీడీపీ- 32, సీపీఐ- 277, BSP- 324, ఆప్- 51, ఫార్వర్డ్ బ్లాక్- 241 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్ల పరిశీలన ఉండనుంది. ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 3తో ముగియనుండగా 11న ఎన్నికలు జరగనున్నాయి.