అమెరికాకు ఇరాన్ కలిగించిన నష్టం ఎంతంటే?

అమెరికా చెబుతున్నదానికంటే ఇరాన్ దాడుల వల్ల ఆ దేశానికి యుద్ధంలో ఎక్కువ నష్టం వాటిల్లిందని 'ది వాషింగ్టన్ పోస్ట్' విశ్లేషించింది. ఇరాన్ విడుదల చేసిన 100కు పైగా ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించగా, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాల్లో కనీసం 228 నిర్మాణాలు, ఖరీదైన యుద్ధ పరికరాలు దెబ్బతిన్నాయని వెల్లడైంది. హ్యాంగర్లు, రాడార్ వ్యవస్థలు, ఇంధన నిల్వ కేంద్రాలు, విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తీవ్రంగా నాశనమయ్యాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి అమెరికాకు సుమారు 50 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని అంచనా.
