స్కూల్ బ్యాగ్ బరువే చదువులో గుణాత్మకతకు కొలమానం కాదు. పిల్లలు మోయలేని భారాన్ని బాగ్స్‌లో పెడితే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిపుణుల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు విద్యార్థి బరువు 10% మించకూడదు. 1–2 తరగతులకు 1.5 నుండి 2 కిలోలు, 3–5 తరగతులకు 2 నుండి 3 కిలోలు, 6–8 తరగతులకు 3 నుండి 4 కిలోలు, 9–10 తరగతులకు 4 నుండి 5 కిలోలు మాత్రమే ఉండాలి. అధిక బరువు వల్ల పిల్లల్లో వెన్నునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.