కొబ్బరికాయలో నీరు, మీగడ గుర్తించడం ఎలా?

5480చూసినవారు
కొబ్బరికాయలో నీరు, మీగడ గుర్తించడం ఎలా?
ఎక్కువ నీరున్న కొబ్బరికాయను గుర్తించడానికి దాని బరువు, శబ్దాన్ని గమనించాలి. బరువుగా ఉండి, ఊపినప్పుడు నీళ్లు చిమ్మిన శబ్దం వస్తే అందులో నీరు సమృద్ధిగా ఉన్నట్లు. తాజా కొబ్బరికాయలు లేత ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. పాతబడిన కాయలు పసుపు పచ్చగా లేదా గోధుమ రంగులోకి మారతాయి. తీపి నీటి కోసం లేత పచ్చటి కాయలను, నీటితో పాటు లేత మీగడ కోసం కొద్దిగా పసుపు పచ్చ రంగులోకి మారుతున్న కాయలను ఎంచుకోవాలి. ఈ జాగ్రత్తలతో వేసవిలో ఆరోగ్యకరమైన కొబ్బరి నీటిని ఆస్వాదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్