ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా HPV వ్యాక్సినేషన్ కార్యక్రమం కాసేపట్లో ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 14 ఏళ్ల బాలికలకు టీకా పంపిణీ చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరోవైపు తెలంగాణలో కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో నిర్వహించే టీకా పంపిణీ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొంటారు.