
పీఎస్‌లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని యువకుడి ఆత్మహత్యాయత్నం
TG: వరంగల్‌లోని అజాం జాహి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కట్ల హర్షిత్ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మంటలు ఆర్పే క్రమంలో రైటర్ ప్రవీణ్‌కు గాయాలయ్యాయి. ఇద్దరినీ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తల మధ్య కుటుంబ వివాదం, తన బిడ్డను దూరం చేశారంటూ అత్తింటివారి వేధింపుల కారణంగానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు హర్షిత్ ఆరోపించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




