బాలీవుడ్‌లో 'గ్రీక్ గాడ్'గా పేరుగాంచిన స్టార్ హీరో హృతిక్ రోషన్ 'డాన్ 3'లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్ తప్పుకున్న తర్వాత, ఆ పాత్రకు హృతిక్ మాత్రమే సరిగ్గా సరిపోతారని చిత్రబృందం భావిస్తోంది. చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. 'వార్ 2' ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో, హృతిక్ ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించారు. 'క్రిష్ 4' కూడా ఆర్థిక సమస్యలతో ఆలస్యం అవుతోంది. ఈ నేపథ్యంలో 'డాన్ 3'లో హృతిక్ ఎంట్రీ ఆసక్తికరంగా మారింది.