టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదైనా ప్లాన్ చేస్తోందా?

11454చూసినవారు
టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదైనా ప్లాన్ చేస్తోందా?
పాకిస్తాన్‌ టర్కీ నుంచి భారీగా సైనిక సామగ్రి, డ్రోన్లను సమకూర్చుకుంటున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఆగస్టు 19 నుంచి 21 మధ్య టర్కీకి చెందిన C-130 సైనిక విమానాలు పాక్‌లోని నూర్‌ఖాన్‌, మసూర్‌ వైమానిక స్థావరాలకు రాకపోకలు సాగించినట్లు సమాచారం. వీటి ద్వారా డ్రోన్లు, ఇతర రక్షణ పరికరాలు తరలించి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. చైనా నుంచి కూడా ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయుధాల సరఫరాపై టర్కీ, పాక్‌ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్‌ తన డ్రోన్‌, వైమానిక రక్షణ సామర్థ్యాలను పెంచుకుంటోందనే చర్చ జరుగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్