AP: సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో మూడో రోజు కోడి పందేలు హోరాహోరీగా సాగుతున్నాయి. పైబోయిన వెంకటరామయ్య బరిలో రూ. 63 లక్షల విలువైన కోడి పందెం జరిగింది. హైదరాబాద్ నుంచి కొవ్వూరి జానకిరామరాజు (పచ్చకాకి), పసల శ్రీకృష్ణ (నల్ల కాకి) మధ్య పందెం జరిగింది. ఈ పోటీలో పసల శ్రీకృష్ణ కోడి విజయం సాధించింది.