
సీజేఐపై దాడి చేసిన లాయర్‌కు సుప్రీంకోర్టులోకి ప్రవేశం రద్దు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించిన న్యాయవాది రాకేష్ కిశోర్‌కు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ షాక్ ఇచ్చింది. రాకేష్ సభ్యత్వాన్ని రద్దు చేయడంతోపాటు సుప్రీంకోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించకుండా ఆయన ఎంట్రీ కార్డును రద్దు చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 6వ తేదీన ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా సీజేఐ జస్టిస్ గవాయ్‌పై న్యాయవాది బూట్ విసిరేందుకు ప్రయత్నించాడు.




