
బంగ్లాదేశ్‌లో శిక్షణ ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి (వీడియో)
బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో సెప్టెంబర్ 9న ట్యాంక్ శిక్షణ విన్యాసాల సమయంలో జరిగిన పేలుడులో ఇద్దరు సైనికులు మృతి చెందారు. ఈ ఘటనలో ఒక అధికారి గాయపడ్డారు. గాయపడిన అధికారిని ఢాకాలోని సైనిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కారణాలు తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.




