రూ.62వేల కోట్ల భారీ డిఫెన్స్ డీల్

9804చూసినవారు
రూ.62వేల కోట్ల భారీ డిఫెన్స్ డీల్
భారత రక్షణ శాఖ, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో రూ.62,370 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం 97 తేజస్ Mk-1A ఫైటర్ జెట్లను HAL తయారు చేయనుంది. వీటిలో 68 సింగిల్-సీటర్ ఫైటర్లు, 29 ట్విన్-సీటర్ ట్రైనర్ విమానాలు ఉంటాయి. ఈ ఒప్పందం 'ఆత్మనిర్భర్ భారత్' ప్రయత్నాలను బలోపేతం చేయడంతో పాటు, వేలాది ఉద్యోగాలను సృష్టించి, 105 భారతీయ కంపెనీలకు భాగస్వామ్యం కల్పించనుంది.