
తిరుమలలో రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలో జులై 14, 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. జులై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జులై 17న ఆణివార ఆస్థానం కార్యక్రమాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 13, 16 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని, అలాగే జులై 17న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను కూడా రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది.




