
చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ మెహందీ వేడుక.. వీడియో వైరల్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్తో గుర్తింపు పొందిన నటి అవికా గోర్, తన ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లాడబోతోంది. ఇటీవల జరిగిన వారి మెహందీ వేడుకలో అవికా, తన అరచేతిపై ప్రియుడితో పాటు తన అత్తమామల పేర్లను కూడా చేతిపై అందంగా రాసుకుంది. దాన్ని కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకలో అవికా రంగుల లెహంగాలో, మిలింద్ రాజస్థానీ తలపాగాతో కనిపించారు. ఇద్దరూ సంతోషంగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.




