మంగళూరు రిఫైనరీలో భారీ పేలుడు.. భయాందోళనలో స్థానికులు

26చూసినవారు
మంగళూరులోని రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ (MRPL)లో బుధవారం మధ్యాహ్నం CHTU లేదా ఫేజ్-3 విభాగంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరం వినిపించగా, మంగళూరు ఎయిర్‌పోర్ట్ కిటికీ అద్దాలు దద్దరిల్లాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో రాజేష్ అనే కార్మికుడు తీవ్రంగా గాయపడి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్