అయోధ్యలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి (వీడియో)

49చూసినవారు
యూపీలోని అయోధ్యలో గురువారం భారీ పేలుడు సంభవించి, ఒక ఇల్లు కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది, అయితే బాణసంచా లేదా గ్యాస్ సిలిండర్ పేలి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.