హైదరాబాద్ ప్రజలకు హెచ్‌ఎండీఏ మరో శుభవార్త అందించింది. అసెంబ్లీ వద్ద 1.5 కిలోమీటర్ల పొడవున 'వై' ఆకారంలో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. నాంపల్లి నుంచి లక్డీకాపూల్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాల కోసం దీనిని నిర్మిస్తున్నారు. పబ్లిక్ గార్డెన్ నుంచి అసెంబ్లీ వెనుక వైపుగా లక్డీకాపూల్ వరకు ఫ్లైఓవర్ ఉంటుంది. లక్డీపాపూల్ దాటిన తర్వాత మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్ వైపు విడిపోయేలా 'వై' ఆకారంలో ఫ్లైఓవర్ నిర్మించాలని హెచ్‌ఎండీఏ ప్లాన్ చేసింది. ఈ ఫ్లైఓవర్ వల్ల నాంపల్లి నుంచి వచ్చేవారు ట్రాఫిక్ రద్దీ లేకుండా మసాబ్ ట్యాంక్, ఖైరతాబాద్ వైపు సులభంగా వెళ్లవచ్చు.